Education: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చట పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచనలు విద్యార్థుల చదువుపై కలెక్టర్ ఆరా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ సూచనలు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ ఆదేశాలు స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పరిశీలించడం, విద్యార్థుల చదువుపై ప్రత్యక్షంగా అవగాహన పొందడం లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహించారు. పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ అక్కడి తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ముఖ్యంగా 10వ...