S.J.K.Ahmed: కోనేరు చిన్నికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి

S.J.K.Ahmed: కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కోనేరు సత్యనారాయణకు తగిన గౌరవం కల్పించాలని కోరారు. కొత్తగూడెం ప్రాంతంలో ప్రజల మధ్య సుపరిచితుడిగా, అందరివాడిగా పేరు సంపాదించుకున్న కోనేరు చిన్ని ఎంతో కాలంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. దివంగత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు చూపిన ప్రజాసేవా మార్గాన్ని అనుసరిస్తూ ఆయన తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) కూడా ప్రజలకు సేవ చేయడంలో...