Narayanpet: రేనివట్లలో ఐదురోజుల నాటక ప్రదర్శనలు
Narayanpet: ప్రపంచ నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాటక కళను ప్రజల్లో మరింత విస్తృతంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజీఏ థియేటర్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో ఐదు రోజుల పాటు ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మునిరంగా స్వామి నాటకం ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నాటకానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నాటక కళను...