Telangana: బీటెక్ విద్యార్థులకు ఫీజులు ఫిక్స్

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ మరియు బీటెక్ కోర్సులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2027-28 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉండేలా కొత్త ఫీజుల నిర్మాణాన్ని నిర్ణయిస్తూ మార్చి 4న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు వేర్వేరు ఫీజులు నిర్ణయించబడ్డాయి. కళాశాలల వసతులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపక వర్గం, విద్యా ప్రమాణాలు వంటి అంశాలను పరిశీలించిన...