Affair: 35-40 ఏళ్ల మహిళలు వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలుసా?
Affair: ఇటీవలి కాలంలో కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర విస్తృతంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంటి పనులు మాత్రమే చూసుకునే స్థితి ఉండగా, ఇప్పుడు మహిళలు కుటుంబం, ఉద్యోగం, పిల్లల సంరక్షణ ఇలా అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు వారి జీవితం బాధ్యతలతో నిండిపోతుంది. పిల్లలను పాఠశాలకు సిద్ధం చేయడం, ఇంటి పనులను చూసుకోవడం, ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడం, సాయంత్రం కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం వంటి పనులతో రోజంతా సమయం గడుస్తుంది. ఈ క్రమంలో మహిళలు తమ వ్యక్తిగత భావాలను, ఇష్టాలను, కోరికలను పక్కన పెట్టి కేవలం బాధ్యతలను మాత్రమే నెరవేర్చే స్థితికి చేరుకుంటున్నారు. కాలక్రమేణా...