Iran-Israel War: భారీగా తగ్గిన కోడి గుడ్డు ధరలు
Iran-Israel War: పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పరస్పరం దాడులు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుండగా, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ రంగం కూడా గణనీయంగా దెబ్బతింటోంది. అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులు నిలిచిపోవడం, మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వంటి పరిణామాలు పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్...