Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు

Stock Market: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారతీయ మూలధన మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు మరియు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ వారం ప్రారంభంలోనే భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే వారాంతానికి దగ్గరపడుతున్న సమయంలో పరిస్థితుల్లో కొంత మార్పు చోటుచేసుకోవడంతో మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. గురువారం రోజున ప్రధాన సూచీలు కొంతమేర పుంజుకుని పెట్టుబడిదారులకు ఆశాజనక సంకేతాలు ఇచ్చాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మార్కెట్ ధోరణిని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉందన్న...