Bharat Gaurav Tourist Train: భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే యాత్రలో జ్యోతిర్లింగాలు, శిర్డీ సాయి దర్శనం

Bharat Gaurav Tourist Train: దేశవ్యాప్తంగా విస్తరించిన పవిత్ర క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనే కోరిక అనేకమంది భక్తుల హృదయాల్లో నిత్యం అలుముకుంటూనే ఉంటుంది. ఆధ్యాత్మిక తపనతో దేవాలయాల సందర్శనకు సిద్ధమయ్యే వారికి ఇప్పుడు అరుదైన అవకాశం లభించింది. భారతీయ రైల్వే పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైలు ద్వారా జ్యోతిర్లింగాల యాత్రతో పాటు శిర్డీ సాయి దర్శనాన్ని కలిపి 7 రాత్రులు 8 రోజుల ఆధ్యాత్మిక పర్యటనను ఏర్పాటు చేశారు. భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రత్యేక యాత్రలో దేశంలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు, పౌరాణిక ప్రాధాన్యం గల ప్రాంతాలు, చారిత్రక వైభవం కలిగిన కట్టడాలను దర్శించే...