EPFO: మీ PF ఖాతాలో ఉన్న డబ్బులకు ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లిస్తుందో ఎలా తెలుసుకోవాలంటే?

EPFO: దాదాపు 7.8 కోట్ల మందికి పైగా ఉద్యోగుల ఆశలు మరోసారి నెరవేరకుండానే మిగిలిపోయాయి. ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు కీలకమైన భవిష్యనిధి పథకానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకోబడింది. సంబంధిత సంస్థ 8.25% వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో వడ్డీ పెంపు ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. అయితే వడ్డీ తగ్గింపుల వైపు అడుగు వేయకపోవడం మాత్రం కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 239వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ పథకంలో సభ్యులుగా ఉన్న వారు గత సంవత్సరంలో లభించిన...