Pakistan: భారత్ యుద్దానికి రెడీ అవుతోంది: పాకిస్థాన్
Pakistan: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతూ భీకర సమరానికి దారి తీస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం భయం అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారిన వేళ దక్షిణాసియాలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆయన ఆరోపించడం రాజకీయంగా, దౌత్యపరంగా కొత్త వాదనలకు తెరలేపింది. ఆసిఫ్ అలీ జర్దారీ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సింధూ జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ నీటిని ఆయుధంలా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాంతీయ...