Magic Rice: నీళ్లు పోస్తే చాలు.. వండకుండానే అన్నం రెడీ
Magic Rice: వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతున్న రైతులు సమాజానికి కొత్త దారులు చూపిస్తున్నారు. అలాంటి అరుదైన ప్రయోగాల్లో ఒకటిగా నిలుస్తోంది “మ్యాజిక్ రైస్” పేరుతో ప్రాచుర్యం పొందిన ప్రత్యేక వరి రకం. వంట చేయాల్సిన అవసరం లేకుండా కేవలం నీళ్లలో నానబెట్టడం ద్వారా అరగంటలోనే అన్నం సిద్ధమవుతుందనే విశేషం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. కరీంనగర్ జిల్లాలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ ప్రత్యేక వరిని సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంధనం అవసరం లేకుండా, పొయ్యి వెలిగించకుండా, కేవలం నీటితోనే అన్నం సిద్ధమవుతుందనే అంశం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా...