Road Name: ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందట?.. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే!
Road Name: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పరస్పర దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఫిబ్రవరి 28న జరిగిన సంయుక్త దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్టు వెలుగులోకి రావడంతో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ మహానగరంలో ఖమేనీ పేరుతో ఓ రహదారి ఉందన్న విషయం వెలుగులోకి రావడం అనూహ్య చర్చకు దారితీసింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక నాయకుడి పేరు మన నగరంలో ఒక రహదారికి ఉండటం...