Nagar kurnool: బాత్‌రూమ్‌లో మైనర్ బాలిక ప్రసవం.. చివరికి!

Nagar kurnool: నాగర్‌కర్నూల్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక సంచలన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్కానింగ్ కేంద్రంలోని మరుగుదొడ్డిలోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించడం, అనంతరం పుట్టిన శిశువును చెత్తబుట్టలో వేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయస్సులో గర్భధారణ, ఆపై ఆస్పత్రి పరిసరాల్లోనే జరిగిన ప్రసవం, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక తన తల్లితో కలిసి వైద్య సేవల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయించుకోవాలని సూచించడంతో వారు ఒక ప్రైవేటు స్కానింగ్ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా...