Family Tragedy: నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

Family Tragedy: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను హతమార్చి, అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకోవడం హృదయాలను కలచివేసింది. సంతోషంగా ఉండాల్సిన ఒక కుటుంబం క్షణాల్లో శోకసంద్రంలో మునిగిపోవడంతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకోగా,...