Suspense Drama: ఫ్యూజులు ఎగిరే ట్విస్టులు.. మస్త్ మసాలా.. క్లైమాక్స్ అయితే ఊహాతీతం భయ్యా

Suspense Drama: సినిమా రంగంలో ఎన్నో జానర్లు ఉన్నప్పటికీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఉన్న ఆదరణ ప్రత్యేకమైంది. ఉత్కంఠభరిత కథనం, ఊహించని మలుపులు, చివర్లో షాక్ ఇచ్చే క్లైమాక్స్ వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఒక భాషలో విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం లేదా అనువాద రూపంలో ప్రసారం చేయడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ నేపథ్యంలో మలయాళంలో రూపొందిన ‘భ్రమమ్’ చిత్రం మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ చిత్రం 2018లో విడుదలై ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం అంధాధున్కు అధికారిక మలయాళ రీమేక్. హిందీ సంస్కరణలో ప్రధాన పాత్ర పోషించిన ఆయుష్మాన్ ఖురానా స్థానంలో మలయాళ రూపంలో పృథ్వీరాజ్ సుకుమారన్...