TDB: శబరిమల ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ
TDB: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ పరిపాలనా సంస్థ అయిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సంప్రదాయ విధానాలనే కొనసాగించాలనే నిర్ణయాన్ని వెల్లడించింది. ఆలయ పవిత్రత, ఆచార వ్యవస్థలను కాపాడటం తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేస్తూ మహిళల ప్రవేశ అంశంలో పాత సంప్రదాయాలకే మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు 14 మార్చి లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు...