CM Revanth Reddy: దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి

CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సమితి కీలక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై సంస్థ భవిష్యత్ దిశపై సమగ్రంగా చర్చించారు. ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యక్రమాల అమలు, ప్రజల్లో విశ్వాసం పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ...