Raptee HV: 36 నిమిషాల్లో ఛార్జ్, 8 ఏళ్ల వారంటీ! 200 కి.మీ రేంజ్‌.. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి

Raptee HV: భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల విప్లవం రోజురోజుకూ వేగం పెంచుకుంటోంది. ఇంధన ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు కలిసివచ్చి వినియోగదారులను ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం కొత్త సంస్థలకే పరిమితమైన ఈ రంగంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖ తయారీ సంస్థలు కూడా అడుగుపెట్టి ఆధునిక నమూనాలను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఫలితంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన, శక్తివంతమైన, ఆకర్షణీయమైన ఎన్నో ఎంపికలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మార్పులో భాగంగా చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రప్తి హెచ్‌వీ (Raptee HV) సంస్థ కూడా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌తో ముందడుగు వేసింది....