Neha Shetty: ఈ అందాల భామను జర పట్టించుకోండయ్యా!.. డీజే టిల్లు హీరోయిన్‌కి కరువైన ఆఫర్లు
Neha Shetty: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క చిత్రంతో అపారమైన గుర్తింపు సంపాదించుకున్న నేహా శెట్టి ప్రయాణం ఆసక్తికర మలుపులతో కొనసాగుతోంది. మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయిన చిత్రం మెహబూబా. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది పూరి జగన్నాథ్. ఇందులో ఆయన తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినా, నేహా శెట్టికి మాత్రం పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తొలి ప్రయత్నం నిలదొక్కుకోకపోయినా, ఆమె నటనపై సినీ వర్గాల దృష్టి పడింది. అయితే నిజమైన మలుపు మాత్రం డీజే టిల్లు చిత్రంతోనే వచ్చింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన...