Health Mission-100: మహిళలకు డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్

Health Mission-100: ప్రజారోగ్య పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకూ ఆరోగ్య సేవలను సమగ్రంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి మహిళకు డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య సేవలను సమయానికి అందించడమే కాకుండా, వ్యక్తిగత వైద్య చరిత్రను ఒకే వేదికపై నమోదు చేసి భవిష్యత్తులో చికిత్సను సులభతరం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజారోగ్య వ్యవస్థను శక్తివంతం చేయడానికి 100 రోజుల సమగ్ర ఆరోగ్య ఉద్యమాన్ని ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కేంద్రంగా...