ICC: T20 WC క్రికెటర్స్ అంతా క్షేమం

ICC: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఒక్కసారిగా ముదిరిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ vs అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు యుద్ధ వాతావరణానికి దారితీయగా, శనివారం ఇరాన్ వైపు నుంచి దుబాయ్ వంటి కీలక నగరాలపై క్షిపణి దాడులు జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన క్షిపణులు, భద్రతా వ్యవస్థల ప్రతిస్పందనతో నగరాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ క్రీడా ప్రపంచానికీ ప్రభావం చూపాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్నట్టు క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ (International Cricket Council) అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది....