Iran vs Israel: యుద్ధం మొదలైంది

Iran vs Israel: టెహ్రాన్‌తో పాటు ఇరాన్ దేశవ్యాప్తంగా సుమారు 30కు పైగా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దళాలు ఉమ్మడిగా క్షిపణి దాడులకు దిగినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ మెరుపు దాడులతో రాజధాని సహా పలు నగరాలు బాంబుల శబ్దాలతో దద్దరిల్లినట్లు సమాచారం. ప్రత్యేకంగా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలుస్తోంది. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలు లక్ష్యాలుగా మారాయి. ఇరాన్ అణు శక్తి సంస్థకు సంబంధించిన కేంద్రాల సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ...