Morning Diet: ఉదయాన్నే ఈ 4 ఆహారాలను అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదం!

Morning Diet: ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి చాలా మందికి జీవితమే పరుగు పందెంలా మారిపోతుంది. పనుల ఒత్తిడి, సమయాభావం, ఆఫీస్‌కి ఆలస్యమవుతుందనే ఆందోళన మధ్య అల్పాహారం విషయంలో నిర్లక్ష్యం పెరుగుతోంది. ఏదో ఒకటి తిన్నామా లేదా అన్నట్టుగా తొందరలో పడిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకునే కొన్ని పదార్థాలు దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కడుపులో ఆమ్ల ఉత్పత్తి అసమతుల్యంగా మారుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలై క్రమంగా బరువు పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దీర్ఘకాలంలో...