Bhadrachalam: పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి గర్భస్రావం.. చివరికి బాత్రూమ్లో!..
Bhadrachalam: ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ మైనర్ బాలిక ఇంటర్ పరీక్ష రాయడానికి హాజరై పరీక్ష హాల్లోనే తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ తప్పిపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా సాగాల్సిన పరీక్షా కేంద్రం ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులకు వేదికైంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా చోటుచేసుకున్న ఈ సంఘటన అక్కడున్న సిబ్బందిని, అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటూ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక తనకు కేటాయించిన...