Hollywood: వార్నర్ బ్రదర్స్ డీల్ నుంచి వైదొలిగిన నెట్ఫ్లిక్స్.. పారామౌంట్ చేతికి హాలీవుడ్ సామ్రాజ్యం
Hollywood: ప్రపంచ వినోద రంగాన్ని కుదిపేసిన అతిపెద్ద ఒప్పంద పోరులో చివరకు కీలక మలుపు చోటుచేసుకుంది. హాలీవుడ్ స్టూడియోల కొనుగోలు విషయంలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరకు నెట్ఫ్లిక్స్ రేసు నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. మొదట వార్నర్ బ్రదర్స్ సంస్థను సుమారు 83 బిలియన్ డాలర్లకు దక్కించుకోవాలని భావించిన నెట్ఫ్లిక్స్, ఆర్థిక లెక్కలు తిరగబెట్టిన తరువాత వెనక్కి తగ్గినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో పారామౌంట్ స్కైడాన్స్ తన ఆఫర్ను ఒక్కో షేరుకు 31 డాలర్లకు పెంచి, మొత్తం ఒప్పంద విలువను 111 బిలియన్ డాలర్లకు చేర్చడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఆ స్థాయి పెట్టుబడిని సమర్థవంతంగా...