wedding season: పెళ్లిళ్ల సీజన్లో పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు
wedding season: ఇంట్లో చిన్నపాటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం తెలుగు కుటుంబాల్లో సాంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొదలైన వెంటనే పెళ్లిళ్ల సీజన్ జోరందుకోవడంతో పసిడి కొనుగోళ్లకు డిమాండ్ మరింత పెరిగింది. పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం, వెండి నగలే. వధూవరుల కోసం ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించడం, కుటుంబ సభ్యులకు కానుకలు కొనడం వంటి కారణాలతో మార్కెట్లో లావాదేవీలు చురుకుగా సాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మార్పిడి విలువలు, దిగుమతుల వ్యయభారం వంటి కారణాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఎగిసిపడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే, మరుసటి రోజు మళ్లీ...