Hugo: మరణాన్ని గెలిచిన మాతృత్వం.. గర్భాశయం లేకపోయినా తల్లి అయిన మహిళ
Hugo: వైద్యశాస్త్రం అసాధ్యంగా భావించిన ఒక ఘట్టం సాక్షాత్తు అద్భుతంగా ఆవిష్కృతమై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పుట్టుకతోనే గర్భాశయం లేని ఓ మహిళ తల్లి కావడం అనే కలను నిజం చేసుకొని మాతృత్వానందాన్ని ఆస్వాదించడం వైద్యరంగంలో అరుదైన విజయంగా నిలిచింది. గర్భాశయం లేకపోవడం వల్ల జీవితాంతం తల్లితనం దూరమవుతుందని భావించిన ఆ మహిళ జీవితంలో ఒక అపరిచిత దాత ఆశాకిరణంగా మారి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంఘటనగా ఈ పరిణామం నిలిచింది. పుట్టుకతోనే గర్భాశయం అభివృద్ధి చెందని అరుదైన జన్యు సమస్యతో బాధపడుతున్న గ్రేస్ బెల్ అనే మహిళ ఎన్నో సంవత్సరాలు మానసిక వేదన అనుభవించారు. మాతృత్వం అంటే ప్రతి మహిళ హృదయంలో దాగి ఉన్న...