Supreme court vs NCERT: మరోసారి NCERTపై సుప్రీం సీరియస్.. పుస్తకం బ్యాన్

Supreme court vs NCERT: దేశ విద్యా వ్యవస్థలో సంచలనం రేపిన పరిణామంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) రూపొందించిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ఒక పూర్తి అధ్యాయంగా చేర్చడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమే అని సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని స్వయంగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ధర్మాసనం, పాఠ్యాంశం రూపకల్పన వెనుక ఉద్దేశ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినేలా చేసే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఘాటు...