POCSO Case: ఇద్దరమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ జ్యోతిష్కుడు.. కోర్టు సంచలన తీర్పు

POCSO Case: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో జ్యోతిష్యుడికి కఠిన శిక్ష పడింది. బాలికలపై అమానుషంగా ప్రవర్తించినందుకు పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 200 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఘనమైన తీర్పును వెలువరించింది. అంతేకాకుండా బాధిత బాలికలకు ఆర్థిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన వెలుగులోకి రావడం ఆలస్యమైనప్పటికీ, కోర్టు తీర్పు సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. 2021 నవంబర్‌లో శివగంగ జిల్లా మానగిరి ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడిని ఒక మహిళ ఆశ్రయించింది. తన ఇద్దరు కుమార్తెలకు చదువులో పురోగతి లేదని, వారికి ఎలాంటి దోషాలు...