Gang Assault Case: పక్కకు లాక్కెళ్లి ప్రియుడి ముందే అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు దారుణం
Gang Assault Case: అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల యువతిపై గుంపుగా దాడి చేసి అత్యాచారం చేయడంతో పాటు ఆమె ఖాతా నుంచి రూ.10,000 బలవంతంగా బదిలీ చేయించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం సమయంలో తన ప్రియుడితో కలిసి విహారానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సిల్చార్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బైపాస్ రోడ్డుపై వారు కారులో వెళుతుండగా, మరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు....