Kadapa: లాడ్జిలో అర్ధరాత్రి కేకలు.. వెళ్లి చూస్తే..?

Kadapa: అర్ధరాత్రి వేళ కడప జిల్లా రాజంపేట పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డుపై ఉన్న దీప్ లాడ్జిలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి తీవ్ర కలకలం రేపింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటలు, పొగలను గమనించి భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు పొగ వలన అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. లాడ్జిలో విద్యుత్ లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయని...