AP Liquor Scam: సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్ రెడ్డి
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి చివరకు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 24) తిరస్కరించడంతో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి వెళ్లి సరెండర్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా బెయిల్ లభించలేదు. జనవరి 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఉపశమనం దక్కలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిల...