Road Safety Cess: భారీగా పెరగనున్న వాహనాల ధరలు.. ఎప్పటినుంచో తెలుసా?

Road Safety Cess: రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రత ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ‘రహదారి భద్రత పన్ను’ పేరుతో కొత్త సెస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధన 1 మార్చి 2026 నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ తర్వాత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే కొత్త వాహనాలపై ఈ పన్ను తప్పనిసరిగా వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కార్లు, ప్రయాణికులను రవాణా చేసే ఆటోలు, ఇతర వ్యక్తిగత వినియోగ వాహనాలపై ఈ సెస్ విధించబడుతుంది. వాహనాల...