Brutal incident: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని తల్లి, తమ్ముడిని చంపిన మైనర్ అమ్మాయి
Brutal incident: కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రేమ వివాహానికి కుటుంబం అంగీకరించలేదన్న కోపంతో ఓ 16 ఏళ్ల బాలిక అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో తన ప్రియుడి సహాయంతో కలిసి ఆమె తల్లి అనుష్క (45), తమ్ముడు అహిం (14)లను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కుటుంబ సభ్యులు ప్రేమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. బాధితులను మొదట కాళ్లు, చేతులు కట్టేసి నిర్దాక్షిణ్యంగా హింసించినట్లు స్థానికులు చెబుతున్నారు....