Donald Trump: మళ్లీ అమెరికాకు స్వర్ణ యుగం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో మొదటి ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి నిర్వహించిన వార్షిక స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా స్వర్ణయుగంలో ప్రవేశించిందని ప్రకటించారు. తన నాయకత్వంలో దేశం మునుపటి కంటే మరింత శక్తివంతంగా, సంపన్నంగా, ప్రపంచ వేదికపై ప్రభావవంతంగా మారిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పరిపాలన కాలంతో పోలిస్తే అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని, అమెరికా ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లామని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధ్యక్ష...