Telangana: ‘సర్’ అమలుకు సన్నాహాలు..ఆధారాలు లేకపోతే ఓటు తొలగింపు

Telangana: ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళనకు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాబోయే ఏప్రిల్ నెల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారులు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తూ ఓటర్ల పూర్తి సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. గణాంకాల ప్రకారం 2002లో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2.20 కోట్లుగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య...