PACS Employees: గుడ్ న్యూస్.. జీతాలు 20 శాతం పెంపు

PACS Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఆర్థిక బలాన్ని అందించే ఈ సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 20 శాతం వేతన పెంపును ఆమోదిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అంశంపై స్పష్టత రావడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అదే సమయంలో గ్రాట్యుటీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలపడం మరింత ఉత్సాహాన్ని నింపింది. సేవల అనంతరం ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదనంగా ప్రతి ఉద్యోగికి సమగ్ర...