Intermediate Exams: 5 నిమిషాలు లేటైనా పర్వాలేదు!
Intermediate Exams: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కనీసం గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. అయితే పరీక్ష ప్రారంభ సమయానికి...