T20 World Cup: భారత్ ఓడినందుకు రవిశాస్త్రి హ్యాపీ.. ఎందుకంటే?
T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి పోరులో భారత జట్టు పరాజయం పాలవడం క్రీడాభిమానులను కలవరపరిచింది. అయితే ఈ ఓటమిపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది ఆశ్చర్యానికి గురయ్యేలా, ఈ పరాజయం భారత జట్టుకు మేలే చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఎదురైన ఈ ఫలితం జట్టుకు ఒక హెచ్చరికలా పనిచేస్తుందని, లోపాలను సరిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు. పెద్ద టోర్నీలో ప్రారంభ విజయాలు కొన్నిసార్లు జట్టులో అతివిశ్వాసాన్ని పెంచుతాయని, అది చివరికి ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందని ఆయన విశ్లేషించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ...