Cricketers In Dhurandhar: హంజాగా కోహ్లీ.. రెహమాన్‌గా ధోనీ
Cricketers In Dhurandhar: వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న స్పై యాక్షన్ కథా చిత్రం ‘ధురంధర్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సాగిన ఈ కథ, దేశభక్తి భావనతో కూడిన గూఢచారి కార్యకలాపాలను ఆవిష్కరించడంతో ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసింది. ముఖ్యంగా ప్రధాన పాత్రలో రణవీర్ సింగ్ చూపించిన శక్తివంతమైన నటన, ప్రతినాయకుడిగా అక్షయ్ ఖన్నా ప్రదర్శించిన భావోద్వేగభరిత అభినయం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. కథనం వేగం, ఉత్కంఠభరిత దృశ్యాలు, హృద్యమైన నేపథ్య సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల ప్రశంసలను...