High Court: శారీరకంగా వాడుకుని, జాతకాల సాకుతో పెళ్లి వద్దంటే కుదరదు
High Court: వివాహం పేరుతో మోసం చేశాడనే ఆరోపణలతో నమోదైన కేసు తాజాగా న్యాయస్థానంలో కీలక మలుపు తిరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఆ హామీ ఆధారంగా తనతో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తాము చాలా కాలంగా సన్నిహిత సంబంధంలో ఉన్నామని, భవిష్యత్తు జీవితంపై పరస్పరం చర్చలు జరిపామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే పెళ్లి విషయాన్ని ఖరారు చేయాల్సిన దశకు వచ్చేసరికి జాతకాలు కుదరలేదనే కారణాన్ని చూపిస్తూ నిందితుడు వెనక్కి తగ్గాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన అంగీకారం పూర్తిగా వివాహ హామీపై ఆధారపడి ఉందని, ఆ హామీ...