Palakurthi Sarangapani: వర్ధన్నపేట ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

నైట్ డ్యూటీ వైద్యుల గైర్హాజరు ఆరోపణలు ఆగ్రహించిన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు: పాలకుర్తి సారంగపాణి స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవల నిర్వహణపై పట్టణ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం ఆయన ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా రాత్రి పూట డ్యూటీ వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం అందడంతో చైర్మన్ తక్షణమే...