Kantara Controversy: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్కు తాత్కాలిక ఊరట
Kantara Controversy: ‘కాంతార’ చిత్రంలో ప్రాధాన్యం పొందిన దైవ నర్తనను అనుకరించిన ఘటనకు సంబంధించిన వివాదంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, దర్యాప్తు ప్రక్రియకు ఆయన పూర్తిగా సహకరించాలనే షరతుతో ప్రస్తుతం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలకంగా స్పందిస్తూ, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీయడం ఎవరికీ హక్కు కాదని స్పష్టం చేసింది. అది ఉద్దేశపూర్వకంగానో, అజ్ఞానవశంగానో జరిగినా అలాంటి చర్యలు సమాజంలో ఆవేదనకు...