Flying Drone Umbrella: గాల్లో ఎగిరే గొడుగు గురించి మీరెప్పుడైనా విన్నారా?

Flying Drone Umbrella: ఎండా వానల నుంచి రక్షణ కోసం మనం ఉపయోగించే సాధారణ గొడుగులు ఎన్నో సంవత్సరాలుగా మన జీవితంలో భాగమయ్యాయి. అయితే సాంకేతిక అభివృద్ధి రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్న ఈ కాలంలో, గాల్లో ఎగిరే గొడుగు రూపంలో ఒక వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన ఇంజినీర్ జాన్ ట్సే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ వినూత్న ఆలోచనకు రూపం ఇచ్చాడు. గాల్లో స్వయంచాలకంగా ఎగురుతూ వినియోగదారుడి తలపై నీడనిచ్చే ఈ పరికరానికి ఫ్లయింగ్ డ్రోన్ 2.0 అనే పేరు పెట్టారు. ఈ పరికరం ప్రత్యేకత ఏమిటంటే.. వినియోగదారు కదలికలను గుర్తించి స్వయంగా అనుసరించగలగడం. ఇందులో అమర్చిన...