Operation Octopus: మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ పోలీసులు
Operation Octopus: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. విస్తృత స్థాయిలో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఈ ప్రత్యేక దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ ఆక్టోపస్ (Operation Octopus) పేరుతో చేపట్టిన ఈ భారీ కార్యాచరణలో దేశంలోని 16 రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి సైబర్ నేరాల ముఠాలను ఛేదించారు. ఈ సమగ్ర చర్యల ఫలితంగా మొత్తం 104 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు ఉపయోగిస్తున్న 152 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టారు. అరెస్టయిన వారిలో కేవలం నకిలీ ఖాతాదారులే కాకుండా కొందరు బ్యాంకు సిబ్బంది కూడా ఉండటం...