Inspiration: ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు
Inspiration: తండ్రి మృతి అనే అమితమైన విషాదాన్ని హృదయంలో దాచుకుని ఓ విద్యార్థి తన భవిష్యత్తు కోసం ధైర్యంగా ముందడుగు వేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో భావోద్వేగానికి గురిచేసింది. సంగం మండల కేంద్రానికి చెందిన కందం రాంసాయి కుటుంబంలో నిన్న రాత్రి అనూహ్య విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకంలో మునిగిపోయిన పరిస్థితుల్లో ఇంటి పెద్దను కోల్పోయిన ఆవేదన మధ్య రాంసాయి ఎదుర్కొన్న పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. ఈ విషాదం జరిగినప్పటికీ, అదే సమయంలో అతనికి కీలకమైన ఇంటర్ పరీక్ష ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కళాశాల ఉపాధ్యాయులు కలిసి అతనికి ధైర్యం...