Good News: పీఎం కిసాన్ 22వ విడత అప్‌డేట్

Good News: దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 22వ విడత నిధులపై కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటికే 21 విడతల నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమయ్యాయి. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు, సాగు పనుల సమయంలో ఆర్థికంగా తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6,000 సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం ఈ పథకం ప్రత్యేకతగా నిలుస్తోంది. గత 3 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే సాధారణంగా ఫిబ్రవరి నెల చివరి వారంలోనే విడత...