Telangana: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 4,89,126 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు....