Free Haleem: భారీ సంఖ్యలో ఎగబడ్డ జనం
Free Haleem: రంజాన్ మాసం ప్రారంభమైన వేళ నగరంలో హలీమ్ వాసనలతో సందడి మొదలైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు హోటళ్లలో ప్రత్యేక వంటకాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రచారం కోసం ఒక హోటల్ ప్రకటించిన ఉచిత ఆఫర్ అనూహ్యంగా భారీ గందరగోళానికి దారితీసింది. మటన్ హలీమ్‌ను ఉచితంగా అందిస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించడంతో వందలాది మంది ఒకేసారి అక్కడికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా జనసందోహంతో నిండిపోయింది. నగరంలోని ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం రంజాన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రచార నిమిత్తం ఉచితంగా మటన్ హలీమ్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ సమాచారం నిమిషాల్లోనే విస్తృతంగా...