Ap Government: మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో అంగన్వాడీలు
Ap Government: రాష్ట్ర జైలు వ్యవస్థలో సంస్కరణలకు దారితీసే కీలక నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జైళ్లు, సంస్కరణల బిల్లు అమలు దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఖైదీల పునరావాసం, మార్పు, సామాజిక సమీకరణ లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర చట్టం సూచనల మేరకు జైలు వ్యవస్థలో ఆధునిక మార్పులు చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖైదీలకు క్షమాభిక్ష అవకాశాల విషయంలో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేసింది. ఈ అంశంపై శాసనసభలో మాట్లాడిన హోంమంత్రి వంగలపూడి అనిత జైలు సంస్కరణలు ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. ఖైదీలను కేవలం శిక్ష అనుభవించే వ్యక్తులుగా కాకుండా సమాజంలో...